జియో యూజర్లకు తీపి కబురు..

189
Reliance Jio Prime Subscription Deadline to Be Extended by a Month?
Reliance Jio Prime Subscription Deadline to Be Extended by a Month?
- Advertisement -

జియో యూజర్లకు మరో తీపి కబురు. జియో ప్రైమ్ యూజర్లకు కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు అందించనున్నట్లు ముఖేష్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం జియో డెడ్‌లైన్ విధించింది. అయితే ఆ గడువును మరో నెల పాటు పొడిగించనున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం కొత్త గడువు విధించనున్నట్టు సమాచారం.

రోజుకు 1జీబీ ఉచిత 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, యాప్ సర్వీస్‌లను కావాలనుకునే వారి కోసం జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్న విషయం విదితమే. ఈ నెలాఖరుతో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగుస్తుండగా ఆ తరువాత కూడా ఈ ఆఫర్ కావాలనుకునే వారి కోసం జియో ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రారంభించింది.

ఫిబ్రవరి నెల చివర్లో 10 కోట్ల మంది ఖాతాదారులను జియో కలిగి ఉండగా, వారిలో ఇప్పటి వరకు కేవలం 3 కోట్ల మంది మాత్రమే జియో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందినట్టు సమాచారం. అయితే పూర్తి స్థాయిలో అందరూ ప్రైమ్ మెంబర్ పొందాలంటే ప్రస్తుతమున్న నెల రోజుల టైం సరిపోదని బావించిన జియో యాజమాన్యం.. మరో నెల రోజుల పాటు పొడిగించాలని బావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రైమ్ మెంబర్ షిప్ గడువును మరో నెల రోజు పాటు పొడిగించే అవకాశం లేకపోలేదని తెలిసింది.

jio-plans

దీనికి తోడు ఇప్పటికే ఉన్న ప్లాన్లు, ఆఫర్ ప్యాక్‌లకు తోడుగా మరిన్ని ఆఫర్లను ప్రవేశ పెడితే దాంతో వారు కూడా ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవచ్చని తెలిసింది. అందుకు గాను పూర్తి స్థాయిలో ఖాతాదారులందరూ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవాలంటే మరికొంత సమయం కచ్చితంగా అవసరం అవుతుందన్న భావనకు జియో వచ్చినట్టు తెలుస్తున్నది. అదే జరిగితే దాదాపుగా 90 శాతం వరకు ఖాతాదారులను జియో ఒడిసి పట్టుకున్నట్టే అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై జియో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. త్వరలో గడువు పొడిగింపుపై జియో ప్రకటన చేసే అవకాశం ఉంది.

- Advertisement -