ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన

93
india vs australia

ఆసిస్ గడ్డపై తొలిసారి సిరీస్‌ గెలిచి సగర్వంగా నిలిచింది కోహ్లీ సేన.72 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్‌కి సాధ్యంకానీ విధంగా కోహ్లీ అరుదైన రికార్డు సాధించారు. వర్షం కారణంగా సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో 4 టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది.

చివరిదైన నాలుగో టెస్టులో టీమిండియా పట్టుబిగించి ఆసీస్‌ను ఫాలోఆన్‌లోకి నెట్టింది.దీంతో ఆసీస్‌ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ వరణుడు భారత ఆశలపై నీళ్లు చల్లాడు. అయినా సిరీస్‌ను గెలిచి భారత్‌ రికార్డులను తిరగరాసింది.

కుల్‌దీప్‌ విజృంభన(5 వికెట్ల)తో విజృంభించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌట్‌ అయింది. 322 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్‌.. ఆసీస్‌ను ఫాలోఆన్‌కు ఆహ్వానించింది. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు నమోదు చేసిన పుజారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను గెలుచుకున్నాడు.

గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి.