ఫిబ్రవరిలో మహానాయకుడు..!

262
NTR Mahanayakudu
- Advertisement -

సంక్రాంతి రేసులో విడుదలై పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకున్న సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. ఫస్ట్ షో నుండే మంచి టాక్‌ను సొంతం చేసుకున్న వసూళ్లలో మాత్రం వెనుకబడిపోయింది. దీంతో రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం సెకండ్ పార్టు మహానాయకుడు రీ షూట్‌ చేసే పనిలో పడింది చిత్రయూనిట్.

రీ షూట్ తుదిదశకు చేరుకుంది.ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, కల్యాణ్‌ రామ్‌, వేలాది మంది జూనియర్‌ ఆర్టిస్టుల మధ్య రథయాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. రెండో భాగం ‘మహా నాయకుడు’ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో విడుదల చేయనున్నారు.

బాలకృష్ణ ప్రధానపాత్రలో క్రిష్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్‌, రానా, సుమంత్‌ అక్కినేని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు సమాంతరంగా జరుగుతున్నాయి. కథానాయకుడు మిగిల్చిన చేదు అనుభవాల్ని మహానాయకుడుతో రిప్లేస్ చేసుందుకు చిత్రయూనిట్ కసరత్తు చేస్తోంది.

- Advertisement -