కాంగ్రెస్‌లోకి కరీనా..ఎంపీగా పోటీ..!

251
kareena kapoor
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందా…! కాంగ్రెస్‌ నుండి పోటీచేసేందుకు రంగం సిద్ధమైందా అంటు అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల విజయంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌లోనూ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు గెలుపు వ్యూహాలు రచిస్తోంది.

ఈ క్రమంలో పార్టీకి సినీ గ్లామర్ అద్దేందుకు సిద్దమైంది. భోపాల్‌లో బీజేపీని ఓడించాలంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని.. దానిలో భాగంగా ఇక్కడ నుంచి కరీనాను పోటీ చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం.

ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రమే కాక మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కొడలు వంటి అంశాలు కరీనా గెలిచేందుకు సహకరిస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌ తాత ఒకప్పుడు భోపాల్‌ నవాబ్‌గా ఉన్నారు.దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కరీనా కాంగ్రెస్‌ నుండి పోటీచేస్తే బీజేపీకి చెక్ పెట్టవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే కాంగ్రెస్‌కు మరింత సినీ గ్లామర్ తోడవనుంది. ఇప్పటికే నగ్మా,కుష్బుతో పాటు అజార్,సిద్దూ వంటి క్రికెటర్లు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్లుగా ఉన్నారు.

- Advertisement -