ప్రభాస్ బాటలో ఎన్టీఆర్..!

58
ntr jr

రెబల్ స్టార్ ప్రభాస్ బాటలో నడిచారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సాధారణంగా సినీ సెల‌బ్రిటీల‌కి కార్లు, బైకుల‌పై మ‌క్కువ ఎక్కువ ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఎంత వెచ్చించైన మార్కెట్‌లోకి వ‌చ్చిన కొత్త వాహ‌నాల‌ని కొనుగోలు చేసేందుకు చాలా ఆస‌క్తి చూపుతుంటారు. ఇటీవలె ప్రభాస్ లంబోర్ఘిని కారుని కొనుగోలు చేయగా తాజాగా ఎన్టీఆర్ సైతం ఆ కారును కొనుగోలు చేశారు.

అత్యాధునిక ఫీచర్లతో అత్యంత అద్భుతంగా డిజైన్ చేసిన ఈ కార్‌లో త్వరలోనే తారక్ హైదరాబాద్ రోడ్ల మీద షికారు చెయ్యబోతున్నారు. బెంగుళూరుకి చెందిన ఆటో మొబైలియార్డెంట్ లంబోర్ఘి కొత్త మోడ‌ల్ ఫొటోల‌ను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్‌..రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. అలాగే బుల్లితెర రియాల్టీ షో ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.