గవర్నర్ తమిళిసై తల్లి మృతి…సీఎం కేసీఆర్ సంతాపం

54
kcr

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట్లో విషాదం నెలకొంది. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానాలో చికిత్స పొందుతూ తమిళిసై తల్లి కృష్ణకుమారి మృతిచెందారు. ఇవాళ మధ్యాహ్రం వరకు పార్థివదేహాన్ని రాజ్‌భవన్‌లో ఉంచనుండగా అనంతరం అంత్యక్రియల కోసం చెన్నైకి తరలించనున్నారు.

ఇక గవర్నర్ మాతృమూర్తి మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణకుమారి మరణంపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హరీశ్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి తయాకర్‌ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.