దేశంలో 24 గంటల్లో 35,178 కరోనా కేసులు

82
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోదుకాగా 440 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857కు చేరగా 3,14,85,923 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్‌ కేసులుండగా ఇప్పటివరకు కరోనాతో 4,32,519 మంది మృతిచెందారు. టీకా డ్రైవ్‌లో భాగంగా గత 24 గంటల్లో 55,05,075 డోసులు వేయగా.. ఇప్పటి వరకు 56,06,52,030 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.