జూనియర్ ఎన్టీఆర్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా తీయబోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమా షూటింగ్ అయిపోగానే, అంటే వచ్చే ఏడాది మధ్యలో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఉంటుంది. అయితే, ప్రశాంత్ నీల్ అక్కడక్కడా చిట్‌చాట్‌లలో ఆఫ్ దిరికార్డ్‌గా ఎన్టీఆర్ తో తీయబోయేది ప్యూర్ తెలుగు అండ్ హిందీ సినిమా’ అన్నాడని హిందీ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. సో గుడ్… ఇతర భాషలో ఎన్టీఆర్ డైరెక్ట్ సినిమా చేసే అవకాశం వస్తే.. అంతకన్నా కావల్సింది ఏముంది..?. ఇప్పటికే చాలామంది తమిళ హీరోలు, మలయాళ హీరోలు, కన్నడ హీరోలు ఉపేంద్ర, సుదీప్ కూడా స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేశారు.
కానీ, అలా చేసిన వారిలో తెలుగు హీరోలు చాలా అరుదు. ఎన్టీఆర్ కి హిందీలో డైరెక్ట్ రోల్ చేయడం ఈజీనే. పైగా ఎన్టీఆర్ కి హిందీలో ఫ్లూయెన్సీ ఉంది. ఆర్ఆర్ఆర్ తో పాటు కొన్ని హిందీ యాడ్స్ కి డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నాడు ఎన్టీఆర్. సో, ఎన్టీఆర్ నుంచి డైరెక్ట్ హిందీ సినిమా రాబోతుంది. పైగా ప్రశాంత్ నీల్ సినిమా అనేసరికి ప్రేక్షకుల్లో కేజీఎఫ్ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి.. తెలుగులో తీసి, హిందీలో డబ్బింగ్ చెప్పిస్తే సరిపోదు. కచ్చితంగా హిందీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
Also Read: అనసూయ – విజయ్ గొడవ.. రిజన్ అదే
కాకపోతే.. ఎంతవరకు హిందీ ప్రేక్షకులు ఎన్టీఆర్ ని ఓన్ చేసుకుంటారు..? అదే అసలు కీలకం. దీనికితోడు మళ్లీ తెలుగు మార్కెట్ మీదే ఎన్టీఆర్ పూర్తిగా ఆధారపడాలి. అలాంటప్పుడు హిందీలో డైరెక్ట్ సినిమా అనే ప్రయోగం దేనికి..? అనే అనుమానం కూడా ఉంది. గతంలో చరణ్ డైరెక్ట్ హిందీ సినిమా చేస్తే.. తెలుగు ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగు సినిమాకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది కాబట్టి.. ఆ పొరపాటు జరగకపోవచ్చు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: అనుష్క ప్లేస్ లోకి కుర్ర హీరోలు