అనుష్క ప్లేస్ లోకి కుర్ర హీరోలు

61
- Advertisement -

అనుష్క, న‌వీన్ పోలిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న సినిమా మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్ రూపొందిస్తుంది. వాస్త‌వానికి ఇది ఈ స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్ కావాల్సింది కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతుంది. జూన్ లేదా జులై తొలి వారంలో ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. మొత్తానికి అనుష్క సినిమా ఈ నెల‌లో ఇక లేన‌ట్టే. అయితే, అనుష్క రేసులో తప్పుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర సడెన్ గా యంగ్ హీరోలు రేసులోకి వస్తున్నారు. ‘మసూద’తో బిగ్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో తిరువీర్.

తిరువీర్ ఇప్పుడు రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ‘పరేషాన్’ అనే హిలేరియస్ ఎంటర్‌ టైనర్‌ తో వస్తున్నాడు. వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జూన్ 2న ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. నిజానికి ఈ డేట్ కి అనుష్క సినిమా రిలీజ్ కావాలి. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో అనుష్క సినిమా రేసు నుంచి తప్పుకుంది.

Also Read: ఓటీటీలోకి ఆ మూడు చిత్రాలు

అనుష్క సినిమా ప్లేస్ లోకి ఈ సినిమా వచ్చింది. అలాగే యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ న‌టిస్తున్న తాజా చిత్రం స్పై. ఇందులో నిఖిల్ స్పై ఏజెంట్‌గా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఈ యాక్ష‌న్ థ్రిల్లర్ సినిమా ఆ తర్వాత వారం రిలీజ్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ఐశ్వ‌ర్య మీన‌న్ ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా న‌టిస్తుంది.

Also Read: అనసూయ – విజయ్ గొడవ.. రిజన్ అదే

- Advertisement -