బుల్లి తెరపై ఎన్టీఆర్‌?

224
NTR to Host Bigg Boss Telugu
- Advertisement -

ఎన్టీఆర్‌ త్వరలో బుల్లి తెరపై సందడి చేయబోతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోతో నాగార్జున బుల్లితెర ప్రపంచంలోకి అడుగిడిన తర్వాత బిగ్ స్టార్స్ చాలామంది టీవీ ఇండస్ట్రీవైపు చూస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం మీలో ఎవరు కోటీశ్వరుడు షోతోనే సిల్వర్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్‌పైకి వచ్చారు.

హిందీలో ఫేమ్ అయిన బిగ్ బాస్ షో త్వరలోనే తమిళంలో ప్రారంభం కాబోతోంది. కమల్ హాసన్ హోస్టింగ్ చేయనున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదలైంది. ఇక తెలుగులోనూ ఈ రియాలిటీ గేమ్ షో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న నిర్వాహకులు అందుకోసం యంగ్ టైగర్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. స్టార్ మాటీవీ ఛానెల్ ఈ తెలుగు బిగ్ బాస్ షోని ప్రసారం చేయనున్నట్టు సమాచారం.

ప్రతి వారంలో శని, ఆదివారాల్లో ఈ షో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.  తెలుగులో ప్రారంభమయ్యే ఈ షో జులై నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షో షూటింగ్ మొత్తం ముంబయిలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన జూనియర్ ఇకపై  బుల్లి తెరపై  కూడా తమ అభిమానులను అలరించబోతున్నారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

- Advertisement -