ఐటీకి కేరాఫ్‌ హైదరాబాద్‌

194
Ktr AMerica Tour Updates
- Advertisement -

తెలంగాణ ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కే.తారకరామారావు అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణకు పెట్టుబడులు పెట్టడమే కాదు.. ఐటీ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించేందుకు సభలు,సమావేశాలు, సదస్సులు,చర్చలు జరుపుతున్నారు.తాజాగా  కారిఫోర్నియాలోని శాంటా క్లారా వో ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులతో భేటీ అయ్యారు కేటీఆర్.

ఐటీ సర్వ్ అలియెన్స్ అధ్యక్షులు సతీష్ నన్నపనేని కేటీఆర్ సమావేశమై ఐటీ సంగతులను వివరించారు. గత కొన్నేళ్లుగా ఐటీ రంగంలో వచ్చిన మార్పులు, కంపెనీలు అనుసరిస్తున్న విధానాలు, అవి ఎలా సేవలందిస్తున్నాయనే అంశాలను వివరించారు. ఐటీ సర్వ్ మాజీ అధ్యక్షులు అశోక్ చిట్టిప్రోలు స్టార్టప్ కంపెనీల గురించి ప్రస్తావించారు.

హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలంతో పాటు.. వసతి,సౌకర్యాలు కల్పిస్తే మంచిదన్నారు. భాగ్యనగరం ఐటీకి అడ్డాగా మారిన సంగతులను గుర్తు చేశారు సభ్యులు. భారతదేశంలో ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే పన్నుల రూపేణే ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని చాప్టర్ రిలేషన్స్ డైరెక్టర్ సంతీప్ కిలారు చెప్పారు. కంపెనీలు పెట్టేందుకు అనువైన వాతావరణాన్ని చూస్తే తాము వచ్చేందుకు సిద్దమని ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులు హర్షా రెడ్డి తదితరులు చెప్పారు.

ఐటీ సర్వ్ అసోసియేషన్ సభ్యుల సంఖ్య 150 నుంచి 750కు పెరగడం అభినందనీయమన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. భారత్ కు వచ్చే ఐటీ కంపెనీలకు డబుల్ టాక్స్ పడుతున్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళతానని మంత్రి కేటీఆర్ చెప్పారు. అంతే కాదు.. రెండు సార్లు పన్నులు కట్టేలా కాకుండా రాయితీలు ఇచ్చేలా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని హామీనిచ్చారు.

హైదరాబాద్ లో ఐటీ సర్వ్ సంస్థ సేవలను కచ్చితంగా వినియోగించుకుంటామని చెప్పారు మంత్రి. అదే సందర్భంలో ఐటీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అన్నిరకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రస్తావించారు కేటీఆర్.

- Advertisement -