ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అనౌన్స్ చేసి చాలా రోజులవుతున్నా చిత్రం ఇంకా మొదలుకాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ఈ నెలాఖరన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే వచ్చే నెల మార్చి నుంచి ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ మొదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ కి సంబంధించి శంషాబాద్ దగ్గర ఓ చోట సెట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. కొరటాల శివ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు జరిగాయి. ప్రస్తుతం రెడీ అయిన స్క్రిప్ట్ ఎన్టీఆర్ ను బాగా ఎగ్జైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత మాస్, యాక్షన్ సినిమా ఇటీవల ఎన్టీఆర్ చేయలేదట. సినిమాలో కొరటాల శివ స్టయిల్ సోషల్ మెసేజ్ టచ్ ఈ సారి కాస్త తక్కువే వుంటుందని తెలుస్తోంది. ఆచార్య ఎఫెక్టు తర్వాత కొరటాల శివలో చాలా మార్పులు వచ్చాయట. ముఖ్యంగా సినిమాకు లీడ్ అయిన తొలిసగంలో ఫన్, లవ్, ఫ్యామిలీ జానర్ లు టచ్ చేసి, సెకండాఫ్ మొత్తం మాస్ మీద నడుస్తుందని టాక్ నడుస్తోంది.
అన్నిటికీ మించి ఎన్టీఆర్ పాత్ర అదిరిపోతుందని తెలుస్తొంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎంత త్వరగా ఈ సినిమా వస్తుందా అని చూస్తున్నారు. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి. మరోపక్క ఈ సినిమాని జపాన్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…