ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ.. చంద్రబాబు సిద్ధమేనా?

46
- Advertisement -

ఏపీలో టీడీపీ ప్రభావం మసకబారిన ప్రతిసారి జూ. ఎన్టీఆర్ ప్రస్తావన తెరపైకి వస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించాలని అప్పుడే పార్టీకి పూర్వవైభవం వస్తుందని గత ఎన్నికల్లో ఓటమి తరువాత నుంచి ఈ డిమాండ్ తరచూ వినిపిస్తూనే ఉంది. నందమూరి అభిమానుల నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచి ఈ డిమాండ్ వినిపించడం సర్వసాధారణమే.. కానీ టీడీపీలోని కీలక నేతలు కూడా ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసే పర్యటనల్లో కూడా జూ. ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అయితే చంద్రబాబు ఎప్పుడు కూడా జూ. ఎన్టీఆర్ గురించి నోరు మెదపలేదు.

కానీ తాజాగా నారా లోకేశ్ మాత్రం జూ. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూ. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున జూ. ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఎన్టీఆర్ చేసిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇక ఆ మెల్లగా పార్టీకి దురమౌతూ వచ్చారు తారక్. అయితే ఎన్టీఆర్ టీడీపీకి దూరం కావడానికి చంద్రబాబే కారణం అని కొందరి వాదన. ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే.. ఆయన కుమారుడు లోకేశ్ కు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించి పక్కా ప్రణాళిక బద్దంగా ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం చేశారని వైసీపీ నుంచి వినిపించే విమర్శలు వినిపిస్తుంటాయి.

అయితే తాత గారు పెట్టిన పార్టీకి తన అవసరం ఉంటే కచ్చితంగా టీడీపీలోకి వస్తానని గతంలో ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి కాస్త డైలమాలోనే ఉంది. వచ్చే ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై లాంటివనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఏమాత్రం తేడా కొట్టిన పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్టీఆర్ పార్టీ అండగా ఉండాలని తెలుగు తమ్ముల్లా ఆశ. అయితే అనూహ్యంగా నారా లోకేశ్ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరడంతో.. వచ్చే ఎన్నికలవేళ సమయానికి టీడీపీ తారక్ ను రంగంలోకి దించబోతుందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేస్తే.. నారా లోకేశ్ ను ఎంతమేరకు ఆధారిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీని జూ. ఎన్టీఆర్ కు అప్పగించాలని కొడాలి నాని లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి జూ. ఎన్టీఆర్ ప్రస్తావన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అయింది.

ఇవి కూడా చదవండి…

ఇరాన్‌…ట్రంప్‌ను చంపేస్తాం..!

అదానీ తీరుపై మోదీ మౌనం వీడాలి:కవిత

వరల్డ్ లార్జెస్ట్ హబ్‌గా హైదరాబాద్‌ ఫార్మాసిటీ..

- Advertisement -