వరల్డ్ లార్జెస్ట్ హబ్‌గా హైదరాబాద్‌ ఫార్మాసిటీ..

39
- Advertisement -

హైదరాబాద్‌ ఫార్మాసిటీ వరల్డ్‌ లార్జెస్ట్‌ హబ్‌గా నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు మంత్రి కేటీఆర్. హెచ్‌ఐసీసీలో మూడు రోజులపాటు జరుగనున్న బయో ఏషియా-2023 సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడారు కేటీఆర్.

హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. లైఫ్‌సైన్స్‌ రంగంలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్‌ అవతరించిందని చెప్పారు. గత ఏండేండ్లలోనే 3 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు.ప్రపంచంలోని టాప్‌-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. 2023కుగాను జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డును ప్రొఫెసర్‌ రాబర్ట్‌ లాంగర్‌కు అందజేయనున్నామని చెప్పారు.

తెలంగాణ ఇప్పటికే లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందని చెప్పారు. ఇక్కడ 8 వందలకుపైగా ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు ఉన్నాయన్నారు. దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతున్నదని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -