మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ అనే టైటిల్ తో బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను ఈసినిమా ద్వారా చూపించనున్నారు. ఈమూవీలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలకృష్ణ తన సొంత బ్యానర్ లో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ను కూడా ప్రారంభించారు చిత్రబృందం.
ఈసినిమాలో నటించేందుకు పలువురు సీనియర్ నటీనటులను తీసుకోవడంతో ఎన్టీఆర్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటీ విద్యాబాలన్ నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, సీనియర్ నరేష్, మురళి శర్మ పలువరు సీనియర్ నటులు నటిస్తున్నారు. అక్కినేన నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం రకుల్ ప్రిత్ సింగ్ కూడా ఈసినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటిలో జరుగుతుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈసినిమాలో కీలక సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటిలో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో చాలామంది సీనియర్ నటులు నటించడంతో అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతి కానుకగా మూవీని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఈమూవీకి సంగీతం ఎం.ఎం కీరవాణి అందిస్తున్నారు.