ఆ దర్శకుడికి అసిస్టెంట్ గా చేయాలనుందిః వర్మ

191
ram-gopal-verma

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ ఎప్ప‌డూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో ఉంటారు. తాజాగా ఆయ‌న త‌న ట్వీట్ట‌ర్ లో మ‌రో పోస్ట్ చేశారు. త‌న శిష్యుడిగా ప‌నిచేసిన అజ‌య్ భూప‌తి ఇటివ‌లే ఆర్ ఎక్స్ 100 అనే సినిమాను తెర‌కెక్కించాడు. ఈసంద‌ర్భంగా ఆసినిమా వీక్షించిన రాం గోపాల్ వ‌ర్మ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి పై ప్ర‌శంస‌ల వర్షం కురిపించాడు.

RX-100-MOVIE

మొద‌టి షో నుంచి ఈసినిమా సంచ‌ల‌న ఓపెనింగ్స్ తో దూసుకెళ్తుంద‌న్నారు వర్మ. ఈసినిమా భారీ విజ‌యాన్ని సాధింస్తుంద‌న్నారు. ఆర్ ఎక్స్ 100 సినిమాకు దిమ్మ‌దిరిగే ఓపెనింగ్స్ వ‌స్తున్నాయ‌ని..టికెట్ల కోసం జ‌నాలు థియేట‌ర్ల వ‌ద్ద కొట్టుకుంటున్నార‌ని చెప్పాడు. ఈసంద‌ర్భంగా టీం మొత్తానికి కంగ్రాట్స్ చెప్పాడు వ‌ర్మ‌.త‌న అసిస్టెంట్ గా పని చేసిన అజ‌య్ భూప‌తి..త‌న త‌ర్వాతి సినిమాకు త‌న‌ను అసిస్టెంటుగా చేర్చుకోవాల‌ని కామెంట్ చేశాడు వ‌ర్మ‌.

RX-100-MOVIE

అంతేకాకుండా టాలీవుడ్ లో నాలుగురు టాప్ ప్రోడ్యూస‌ర్లు అజ‌య్ భూప‌తికి అడ్వాన్స్ కూడా ఇచ్చారని ట్వీచ్ చేశారు. ఇక రాం గోపాల్ వ‌ర్మ వ‌ద్ద ప‌నిచేసిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్లందరూ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్ట‌ర్లలో ఉన్నారు. వ‌ర్మ ప్లాప్ సినిమాలు తీసినా అత‌ని శిష్యూలు మాత్రం స‌క్సెస్ పుల్ సినిమాలు తీస్తూ విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారు. ద‌ర్శ‌కుడిగా మొద‌టి సినిమాతోనే త‌న స‌త్తా చాటుకున్నాడు అజ‌య్ భూప‌తి. ఆర్ ఎక్స్ 100 సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది.