జూనియర్ ఎన్టీఆర్ సినీ ప్రముఖులకు నిన్న రాత్రి తన నివాసంలో స్పెషల్ పార్టీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో తన పాత్ర తగ్గడం పై కావొచ్చు, నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చినా.. తనను తాను బాగా ప్రమోట్ చేసుకోలేకపోవడం కావొచ్చు.. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోతున్నాడు అని స్వయంగా తారక్ సన్నిహితులు కూడా అభిప్రాయ పడ్డారు. మరోవైపు గ్లోబల్ స్టార్ గా చరణ్ తనను తాను అద్భుతంగా ప్రమోట్ చేసుకున్నాడు. చరణ్ కి అంటే పెద్ద నెట్ వర్క్ ఉంది. కానీ, ఎన్టీఆర్ కి సొంత వాళ్ళే తొక్కేయ్యాలని చూస్తున్నారు. ఇది ఎన్టీఆర్ పరిస్థితి.
అయితే, ఇలాంటి నేపథ్యంలో అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ తో పాటు డైరెక్టర్ రాజమౌళి, సినీ నిర్మాతలు మైత్రి మూవీస్ నవీన్, శిరీష్ రెడ్డి వంటి వారికి ఎన్టీఆర్ స్పెషల్ పార్టీ ఇచ్చాడు. నిజానికి ఈ పార్టీలో ఇంకా చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఇంతకీ ఎన్టీఆర్ ఎందుకు సడెన్ గా పార్టీ ఇచ్చాడు?, ప్రమోషన్స్ లో ఫెయిల్ అయిన ఎన్టీఆర్.. ఇప్పుడు తీరిగ్గా మెల్కొన్నాడా ? అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, వీరందరికీ ఓ విషయం చెప్పాలి. సాయంత్రం ఆగితే.. ఊరంతా వినిపించేలా నక్క కూతలు కూస్తోంది. నక్క అరుస్తోంది అని అందరికీ తెలుస్తోంది.
నక్కకి సమయం, సందర్భం అవసరం లేదు. సాయంత్రం అయ్యింది, గట్టిగా నాలుగు కూతలు కుయ్యాలి, అంతే. దాన్నే గొప్ప అనుకుంటుంది నక్క. ఇలాంటి నక్క స్వభావం ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. కానీ, సింహం ఎప్పుడు పడితే అప్పుడు గాండ్రించదు. అదును కోసం సింహం ఎదురుచూస్తోంది. సమయం వచ్చినప్పుడు సింహం చేసే గాండ్రింపుతో ఊరంతా ఉలిక్కి పడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ మనస్తత్వం, సామర్థ్యం తెలిసిన వారు ఎవరైనా ఇది నిజమే అని ఒప్పుకుంటారు. కాబట్టి.. జూ. ఎన్టీఆర్ ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే.. తారక్ సింహం లాంటోడు.
ఇవి కూడా చదవండి…