మాజీ ప్రధాని పీవీకి భారత రత్న ఇవ్వాలని తీర్మానం

226
nri trs
- Advertisement -

భారత మాజీ ప్రధాని, ఆధునిక భారత శిల్పి శ్రీ. పీవీ నరసింహ రావు శత జయంతి కార్యక్రమాన్ని కరోనా నిబంధనల దృష్యా లండన్ లో నిరాడంబరంగా నిర్వహించారు ఎన్నారై టి.ఆర్.యస్ యూకే మరియు టాక్ ప్రతినిధులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు పీవీ శత జయంతి వేడుకలు ఎంతో వైభంగా జరుపుకోవాల్సి ఉన్నపటికీ ప్రస్తుత కరోనా నిబంధనలను పాటిస్తూ కేవలం ఆరుగురి ప్రతినిధులకు మించకుండా వారి చిత్రపటానికి పూలతో నివాళ్ళర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు మాట్లాడుతూ,.. తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి వేడుకలు సంవత్సరం పాటు జరుపుతున్న తీరు తెలంగాణ ప్రముఖుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని, వారి ఆలోచనలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పీవీ శతజయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించి ప్రవాసులని, ప్రముఖుల్ని ఆహ్వానిస్తామని తెలిపారు.

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ..పీవీ చరిత్రను రాబోయే తరాలు తప్పకుండ తెలుసుకోవాలని, సంవత్సరం పాటు జరిగే వేడుకల్లో టాక్ సంస్థ తరపున వారి జీవితాంశాలని తెలియజేసేలాగా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఎన్నారై తెరాస వ్యవస్థాపకధ్యక్షుడు మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మీడియా కి పంపిన సందేశం లో.. పీవీ శత జయంతి వేడుకల సందర్భంగా పీవీ కి భారత రత్న ఇవ్వాలని, భారత దేశ ఆర్థిక గతిని మార్చిన సంస్కర్త గౌరవంగా తెలంగాణ ప్రభుత్వం కుదిరితే జాతీయ స్థాయిలో పీవీ జయంతి రోజుని సెలవు దినం గా ప్రకటించి దానికి ప్రత్యేకమైన పేరు పెట్టి వారి సేవలను స్మరించుకోవాలని ఎన్నారై టి.ఆర్.యస్ యూకే మరియు టాక్ సంస్థలు తీర్మానం చేస్తునట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్.యస్ యూకే మరియు టాక్ ప్రతినిధులు అశోక్ గౌడ్ దూసరి, పవిత్ర కంది, సతీష్ గొట్టెముక్కల, స్వాతి బుడగం, సురేష్ బుడగం, జాహ్నవి దూసరి పాల్గొని పీవీ గారికి నివాళ్ళర్పించారు.

- Advertisement -