ఏటీఏఐ ఆధ్వర్యంలో ఘనంగా పీవీ జయంతి..

13
PV

తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు మాజీ ప్రధాని పాములపర్తి నర్సింహారావు శాత జయంతి ఉస్త్సవాలు ఏటీఏఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి ఏటీఏఐ కార్యవర్గం నిర్ణయించింది. ఈ కార్యక్రమాలు 28 జూన్ మొదలు 4 జులై వరకు జరుపనున్నట్లు ఏటీఏఐ కార్యవర్గం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని 28 జూన్ ఆదివారం ఆన్‌లైన్‌లో అతి వైభవంగా ప్రారంభించడం జరిగింది. పీవీ చిత్రపనికి పూల మాలలు అలంకరించి పలువురు తెలంగాణ ప్రముఖులు వారికీ నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.

ఉద్దండుడు, విద్యాప్రదాత బహు బాషా కోవిధుడిని సంస్మరించుకొంటూ పలువురు ప్రసంగించడం జరిగింది. అపరచాణుక్యుడు శతజయంతి ఉస్త్సవాలను జరుపుకొనుటకు ప్రోత్సాహం కల్పించిన మంత్రి కేటీఆర్‌కి, మహేష్ బిగాలా కి మరియు వినయ్ భాస్కర్ కి ధన్యవాదములు తెలియచేసిండ్రు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి అధ్యక్షత వహించగా, కార్యవర్గ సభ్యులు తెలుగు ప్రముఖులు హాజరైయ్యారు.