టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు ఆ పార్టీ ఎన్నారై ప్రతినిధులు. ప్లీనరీకి ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో హాజరైన ప్రతినిధులు కేసీఆర్‌కు విషెస్ చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్నారని ప్రశంసించారు. రైతుబంధు, దళిత బంధు పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అలాగే ఎన్నారైలకు మొట్ట మెదటి సారి కేసీఆర్ తరపున అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించిన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఆర్ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. పదవులను తృణపాయంగా వదిలేసి, ఒక్క అడుగుతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు.