మహానాయకుడు…కేసీఆర్

94
- Advertisement -

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీష్‌ రావు. మహానాయకుడు కేసీఆర్…ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తన ప్రాణాన్ని సైతం ఫ‌ణంగా పెట్టిన ఉద్యమ ధీశాలి మన కేసీఆర్ అని ప్ర‌శంసించారు.

ఉద్యమ స్పూర్తితోనే బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సబ్బండ వర్గాలకు అందిస్తున్న దేశం గర్వించదగ్గ పరిపాలన దక్షుడు మన కేసీఆర్ అని హ‌రీశ్‌రావు కొనియాడారు.

- Advertisement -