ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్న ఎన్నారై టీఆర్‌ఎస్‌ నేతలు..

57

ఈ రోజు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్బంగా ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం ముందుగా ఎన్నారై టీఆర్‌ఎస్‌ పక్షాన మరియు ఎన్నారైల పక్షాన కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో దూలపల్లిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో కలిసి మొక్కలు నాటారు ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, ఎన్నారైల టీఆర్‌ఎస్‌ లండన్ కార్యవర్గ సభ్యులు.

ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. కేటీఆర్ పిలుపుమేరకు సంబరాలకు దూరంగా ఉంటూ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పలువురికి ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. అలాగే లండన్‌లో ఉన్న కార్యవర్గ సభ్యులు కేటీఆర్ పుట్టినరోజు కానుకగా మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే కేటీఆర్ చేస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలను, అభివృద్ధి పనులను గుర్తుచేస్తు దేశం గర్వించదగ్గ నాయకుడిగా కేటీఆర్ ఎదిగారన్నారు. కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారు ఇంకా మరెన్నో ఉన్నత పదవులను అధిష్టించాలని కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్‌ఎస్‌ నాయకులు సతీష్ రెడ్డి గొట్టెముక్కుల,మల్లేష్ పప్పుల,ప్రవీణ్ పంతులు,శుభాష్ మరియు స్థానిక సికింద్రాబాద్ నాయకుడు నరేష్ పాల్గొన్నారు.

NRI TRS UK team participated in #mukkotivruksharchana -#KTRBirthday - 1
NRI TRS UK team participated in #mukkotivruksharchana -#KTRBirthday - 2