ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కె’ ప్రారంభం..

163
Project k

రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు హైదరాబాద్‌లో ఈసినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమా ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్‌లో ప్యాన్ వరల్గ్ లెవల్లో వస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కొత్త గెటప్ లో కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్ర ప్రారంభ వేడుకలో ప్రభాస్‌తో పాటు బిగ్ బీ అమితాబ్ పాల్గొన్నారు. ముహూర్తపు షాట్ ఆయన మీదే తీశారు. కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. తొలి షాట్‌కు ప్రభాస్ క్లాప్ కొట్టాడు. ఈ సినిమా ప్రారంభానికి సంబంధించి ప్రభాస్ తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను కూడా పంచుకున్నారు. గురు పూర్ణిమా సందర్భంగా ఇండియా సినిమా గురువు అమితాబ్ బచ్చన్‌పై క్లాప్‌ కొట్టానని సంబరంగా రాసుకున్నారు. ఈ సినిమా త్వరలో రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణేను హీరోయిన్ నటిస్తోంది. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.