నాగశౌర్యకు రానా సలహా.. ఏంటో తెలిస్తే షాకౌతారు..

146
Rana Daggubati
- Advertisement -

యంగ్‌ హీరో నాగశౌర్యకు బాహుబలి స్టార్‌ రానా దగ్గుబాటి ఓ సలహా ఇచ్చారు. నాగశౌర్యకు రానా సలహా ఏంటని షాకౌతున్నారా..! విషయం ఏంటంటే.. నాగశౌర్య కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో నటుడు బ్రహ్మాజీ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా శౌర్య-బ్రహ్మాజీలకు సంబంధించిన కొన్ని కామెడీ సన్నివేశాల షూట్‌ జరిగింది. షూట్‌ అనంతరం బ్రహ్మాజీ ముఖానికి నామాలు పెట్టుకుని.. అమాయకపు లుక్‌లో నాగశౌర్యతో ఫొటోకు పోజులిచ్చారు. ఈ ఫొటోని షేర్‌ చేసిన శౌర్య.. ‘నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్‌ తనకి ఉండాలి. దయచేసి యంగ్‌ టాలెంట్‌ని ప్రోత్సహించండి’ అని సరదాగా ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌పై శనివారం హీరో రానా స్పందించాడు. ‘వామ్మో ఇదేంటి గురు!! నాగశౌర్య.. దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. బ్రహ్మాజీ చూపు నాకేంటో తేడాగా కనిపిస్తోంది. నువ్వు ఏమంటావ్‌?’ అని రిప్లై ఇచ్చాడు. దీనిపై శౌర్య స్పందిస్తూ.. ‘నువ్వు చెప్పింది కరెక్ట్‌ భయ్యా. నాకూ ఏదో తేడాగా అనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని అన్నారు. ఇలా వీరి మధ్య సరదాగా సంభాషణ సాగింది.

- Advertisement -