టీజాక్ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ తెలంగాణ ప్రభుత్వం పై చేస్తున్న రాజకీయ కుట్ర మాత్రమేనని ఎన్నారై టీఆర్ఎస్ మండిపడింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ యుకే శాఖ కార్యదర్శి సృజన్ రెడ్డి మాట్లాడుతు కోదండరాం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ప్రభుత్వం 65000 ఉద్యోగాలు కల్పించింది ఐతే కోదండరాం విద్యార్థులకు అసలు విషయం చెప్పకుండా వారికి లేనిపోనివి నూరిపోసి వారి భవిష్యత్తును అంధకారంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఉపాధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో చిత్త శుద్ధి తో గడిచిన రెండున్నర సంవత్సరాలల్లో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ నిరుద్యోగుల పేరిట ర్యాలీచెయ్యడం హాస్యాస్పదం గా ఉందన్నారు, వివరణగా టి అర్ ఎస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాల లోపు భర్తీ చేసిన ఉద్యాగాల లెక్కను ఒకసారి చూసి మాట్లాడితే మంచిదని అన్నారు, అంతే కాకుండా కోదండరాం గారు నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తప్పకుండ ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు.
అలాగే ప్రధాని కార్యదర్శి రత్నాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయి తెరాస ఎన్ని ఇచ్చింది ఒక్క సారి విశ్లేషించి చెప్పారు, 1999 నుండి 2004 వరకు టీడీపీ హయాం లో సుమారు 3000 నుంచి 5000 ఉద్యాగాలు ఇస్తే 2004- 2014 వరకు కాంగ్రెస్ హయాం లో సుమారు 15000 ఉద్యోగాలు ఇచ్చారు, ఆ లెక్కన పోల్చుకుంటే తెరాస రెండున్నర ఏండ్లలో అనేక ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అని వివరించారు.
లండన్ ఇంచార్జ్ సతీష్ బాండ మాట్లాడుతూ కోదండరాం గారు నిరుద్యోగుల పేరున ప్రతిపక్షాలతో కలిసి దీన్ని రాజకీయం చేస్తున్నారని, ఇది కేవలం రాజకీయ కుట్ర గా మాత్రమే ప్రజలు చూస్తున్నారని,అలాగే ఇందులో ప్రజల శ్రేయస్సు కాని నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి కానీ కనపడడం లేదని, కాబట్టి ప్రజలు ఇటువంటి నిరాధారమైన ధర్నాలను తప్పకుండ తిప్పి కొడతారు అని అన్నారు.