చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 22

342
On this day in history
- Advertisement -

ఫిబ్రవరి 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 53వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 312 రోజులు (లీపు సంవత్సరములో 313 రోజులు) మిగిలినవి.

*సంఘటనలు*

1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది.
1922: పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు.
1997 : తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం కథానిలయం ప్రారంభం.

జననాలు*

1732: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1799)
1866: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (మ.1949)
1911: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్‌. (మ.1980)
1915: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త. (మ.1968)
1922: చకిలం శ్రీనివాసరావు, నల్గొండ లోకసభ సభ్యులు. (మ.1996)
1938: తాతినేని చలపతిరావు, ప్రముఖ సంగీత దర్శకులు.
1939: కలువకొలను సదానంద, ప్రముఖ బాల సాహిత్య రచయిత.
1966: తేజ, ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు మరియు రచయిత.
1989: అలియా సబూర్, ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసరుగా రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన వ్యక్తి.

*మరణాలు*

1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (జ.1870)
1922: కన్నెగంటి హనుమంతు, పుల్లరి సత్యాగ్రహ నాయకుడు.
1958: మౌలానా అబుల్ కలాం ఆజాద్, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888)
1992: బొడ్డేపల్లి రాజగోపాలరావు, ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు. (జ.1923)
1997: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (జ.1920)
1998: రామణ్ లాంబా , భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (జ.1960)
2011: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ప్రముఖ నటుడు మరియు రచయిత . (జ.1916)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

?ప్రపంచ స్కౌట్ దినోత్సవం,
?కవలల దినోత్సవం

- Advertisement -