వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపు:ఎన్నారై టీఆర్ఎస్

270
nri trs
- Advertisement -

ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు టీఆర్ఎస్‌దే అని ఎన్నారై టీఆర్ఎస్‌ యుకే అధ్యక్షులు దూసరి అశోక్ గౌడ్ స్పష్టం చేశారు. లండన్‌లో నూతన కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకుసాగుతుందన్నారు. ఈ సమావేశంలో క్షేత్రస్ధాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు,వివిధ దేశాల్లో పార్టీ శాఖల విస్తరణ అంశాలపై చర్చించామన్నారు.

ఎన్నారై టీఆర్ఎస్ కార్యకర్తల వెంట ఉండి పోత్సహిస్తున్న ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శ్రేణుల్ని సమన్వయపరుస్తున్న ఎన్నారై కో – ఆర్డినేటర్ మహేష్ బిగాలకు కృతఙ్ఞతలు తెలిపారు.

గత 8 సంవత్సరాల నుండి లండన్ లో మొట్ట మొదటి తెరాస పార్టీ ఎన్నారై శాఖను ఏర్పాటు చేసి ఎన్నో సేవలందించి నేడు మమ్మల్నిముందుకు నడిపిస్తూ,ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన, ఎన్నారై టీఆర్ఎస్ సృష్టికర్త, మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కి ప్రత్యేక కృతజ్ఞతలుతెలియజేశారు.

ఎన్నో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కెసిఆర్ చావు నోట్లో తల పెట్టి ప్రాణాలకు తెగించి కేంద్రం మెడలు వంచితెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, నేడు ఉద్యమ నాయకుడే మన సేవకుడై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గాతీర్చిదిద్దుతున్నారని, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా పటిష్ట నాయకత్వంతోనేసాధ్యమవుతుందని ,కెసిఆర్ గారి తోనే తెలంగాణఅభివృద్ధిసాధ్యమని అన్నారు. అట్టడుగువర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

nri trs uk

మాజీ అద్యక్షులు అనిల్ కూర్మచలం మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా అన్ని విభాగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశం లో నెంబర్ 1 గానిలిపారని, కెసిఆర్ గారి ఆలోచనలు నేడు ప్రపంచాన్నే ఆకర్షించేలా ఉన్నాయని తెలిపారు.

నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, మనమంతా చాలా అదృష్టవంతులమని, మైళ్ళ దూరం లో ఉన్నా, కెసిఆర్ గారి నాయకత్వం లో పని చేసే అవకాశం లంబించిందని, అందరం బాధ్యతతో, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలనికోరారు.

అన్ని సందర్భాల్లో ప్రపంచ వ్యప్తంగా ఉన్న తెరాస శాఖల సమన్వయ ఎంతో స్ఫూర్తినిస్తుందని, సహకరస్తున్న అన్ని శాఖల కార్యవర్గ సభ్యులకు, ముఖ్యoగ అమెరికా తెరాస నాయకులు మహేష్ తన్నీరు గారికి కృతఙతలు తెలిపారు. గత 8 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలకి సహకరించి మద్దత్తిచిన తెలంగాణ సంఘాలకి, వ్యక్తులకి, అభిమానులకి
కృతజ్ఞతలు తెలిపారు.

కార్యవర్గ సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించి తీసుకున్న కీలక నిర్ణయాలని, తీన్మారాల్ని ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి ప్రవేశపెట్టగా వాటిని అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చంద్రశేఖర్ గౌడ్ బలపర్చగా, సభ్యలంతా వాటిని ఆమోదించారు.

వాటి వివరాలు :

1 . రాబోవు ఎన్నికల్లో తెరాస పార్టీ భారీ విజయమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక

2. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు చేరవేయడం, ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం

౩. యూకే లో చేయబోయే కార్యక్రమాల క్యాలెండరు రూపకల్పన

4. నూతనంగా పదవులు చేపట్టిన సభ్యుల బాధ్యతలను వారికి వివరించడం జరిగింది, ప్రతి మూడు నెలలకు ఒక్కసారి కార్యవర్గసమావేశం ఏర్పాటు చేసుకొని సంస్థ చేసిన కార్యక్రమాల పై ఒక బులెటిన్ కూడా విడుదల చేయాలని నిర్ణయించారు.

5. తెరాస ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు, వారికి మద్దత్తు తెలుపుతున్న వ్యక్తులకు – సంస్థలకు సరైన రీతిలో ప్రతివిమర్శనచేసి, నిజా నిజాలు ప్రజలకు తెలిసేలా, ఇటు ప్రత్యక్ష మీడియా ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా తెలుపాలని నిర్ణయించారు.

6 . ఇటు యూకే లోని పలు ప్రాంతాల్లో తెరాస శాఖలను ఏర్పాటు చేయడం, అలాగే వివిధ దేశాల్లో పార్టీ శాఖల ఏర్పాటుకు కృషి చేయడం

7. తెలంగాణ రాష్ట్రం లో వివిధ జిల్లాలోని నిరుద్యోగ యువత కు సహాయపడేలా నూతన పెట్టుబడులను పెట్టేలా ఎన్నారైలతో ప్రత్యేకఅవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించడం

చివరిగా ప్రధాన కార్యదర్శి రత్నాకర్ మాట్లాడుతూ, కార్యవర్గ సమావేశం ప్రతి సభ్యునిలో నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని, హాజరైన విలువైనసూచనలనుసలహాలను అందించినందుకు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం విజయవంతానికి ప్రత్యేకంగా కృషి చేసిన ఈవెంట్ కమిటీ సభ్యులకుప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

nri trs uk

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు: అశోక్ గౌడ్ దుసారి, మాజీ అద్యక్షులు : అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు: నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి: రత్నాకర్ కడుదుల,అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్: సీకా చంద్రశేఖర్ గౌడ్,అడ్వైసరీ బోర్డు సభ్యులు: దొంతుల వెంకట్ రెడ్డి, విక్రమ్ రెడ్డి రేకుల, ప్రవీణ్ కుమార్ వీరా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్: సత్యం కంది, కమ్యూనిటీ అఫైర్స్ వైస్ చైర్మన్: శ్రీధర్ రావ్, మధుసూదన్ రెడ్డి, సెక్రటరీ: సృజన్ రెడ్డి చాడ, హరి గౌడ్ నవపేట్, సత్యమూర్తి చిలుముల, శ్రీకాంత్ జిల్లా, జాయింట్ సెక్రటరీ : సంజయ్ సేరు, సతీష్ రెడ్డి, రమేష్ ఇస్సంపల్లి, సురేష్ గోపతి, అధికార ప్రతినిధి : రవి రతినేని, రవి ప్రదీప్ పులుసు, నవీన్ మాదిరెడ్డి, లండన్ ఇంచార్జి : గణేష్ పస్తం, సురేష్ బుడగం, కోశాధికారి : సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, IT సెక్రటరీ : వినయ్ ఆకుల, వెల్ఫేర్ ఇంచార్జి : రాజేష్ వర్మ, మెంబర్షిప్ ఇంచార్జి : అశోక్ అంతగిరి, ఈస్ట్ లండన్ ఇంచార్జి : ప్రశాంత్ రావ్ కటికనేని, రీజినల్ కోఆర్డినేటర్ (లీడ్స్) : శివ కుమార్ చల్లాపురం, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ : అబ్దుల్ జాఫర్, రామకృష్ణ కలకుంట్ల.

- Advertisement -