ఈ నెల 20న ‘వైఫ్ ఆఫ్ రామ్’

246
manchu lakshmi w/o ram
- Advertisement -

మంచు ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వైఫ్ ఆఫ్ రామ్ సినిమాను ఈనెల 20వ తేదిన విడుద‌ల చేయ‌నున్నారు చిత్ర‌యూనిట్. ఈసినిమాకు విజ‌య్ యొల‌కంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటివ‌లే విడుద‌లైన ఈసినిమా ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కూడా ఈట్రైల‌ర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. ఇటివ‌లే ఈసినిమా ఆడియో ఫంక్ష‌న్ ను కూడా నిర్వ‌హించారు. ఇటివ‌లే ఈసినిమా ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివ‌ల్ లో అఫీషియ‌ల్ ఎంట్రీ సాధించింది.

manchu lakshmi w/o ram

త‌న భ‌ర్త కు అన్యాయం జ‌రిగితే ఓ మ‌హిళ ఏవిధంగా పోరాడుతుంది…త‌న‌కు పోలీస్, ప్ర‌భుత్వం స‌పోర్ట్ లేకున్నా ఎలా పొరాడుతుంది అనే అంశంపై ఈసినిమాను రూపొందించారు. ఈసినిమాలో వ‌చ్చే ఒక్కొ స‌న్నివేశం ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచుతుంద‌న్నారు ద‌ర్శ‌కుడు విజ‌య్. వైఫ్ ఆఫ్ రామ్ సినిమా ఇటివ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాన్ని కూడా పూర్తి చేసుకుంది.

మంచు ల‌క్ష్మీ కెరీర్ లో ఇది మంచి సినిమాగా మిగిలిపోతుంద‌న్నారు. ఈసినిమాలో మంచ‌ల‌క్ష్మీ, సామ్రాట్ రెడ్డి, ప్రియ‌ద‌ర్శి, ఆద‌ర్శ్ ప‌లువ‌రు న‌టీన‌టులు న‌టించారు. సంగీతం ర‌ఘు దీక్షిత్ అందించ‌గా..పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, మంచు ఎంట‌టైన్మెంట్ సంస్ధ‌లు సంయుక్తంగా నిర్మించారు. విభిన్న‌మైన పాత్ర‌లు చేయ‌డంతో మంచు ల‌క్ష్మి ఎప్పుడూ ముందుంటుంది. మ‌రి ఈసినిమాతో ఎవిధంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుటుందో చూడాలి.

- Advertisement -