శ్రీవారి సన్నిధిలో ఎంపీ సంతోష్ కుమార్..

233
santhosh kumar

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడక ద్వారా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు.

రంగనాయకుల మండపంలో సంతోష్ కుమార్‌కు ఆలయ అర్చకులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టు వస్ర్తాలతో సత్కరించారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, చిరుమళ్ల రాకేశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు.

mp santhosh kumar