త్వరలోనే ఎన్నారై పాలసీ తీసుకొస్తాంః ఎంపీ క‌విత‌

159
kavitha

త్వ‌ర‌లోనే కొత్త ఎన్ ఆర్ ఐ పాల‌సీ తీసుకువ‌స్తామ‌ని హామి ఇచ్చారు నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. టీఆర్ఎస్ భ‌వ‌న్ లో జ‌రిగిన ఎన్ ఆర్ ఐ వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఎంపీ క‌విత పాల్గోన్నారు. ఈసంద‌ర్భంగా ఎంపీ క‌విత మాట్లాడుతూ.. విదేశాల‌లో ఉన్న తెలంగాణ బిడ్డ‌లు గ‌ర్వప‌డేలా తెలంగాణ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. ఇప్ప‌టికి 33దేశాల్లో టీఆర్ఎస్ జెండా రెప‌రెప‌లాడుతుంద‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ బిడ్డ‌లు ఎక్కడుంటే అక్క‌డ గులాబీ జెండా ఎగుర‌వేస్తామ‌న్నారు.

kavitha telangan bhavan

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కూడా ఎన్నారైల కృషి మ‌రువ‌లేనిద‌న్నారు. ఎన్నారైలు చేసిన ఉద్య‌మం తెలంగాణ స‌మాజాం ఎన్న‌టికి మ‌ర‌చిపోద‌ని చెప్పారు. మ‌న నాయ‌కుడు కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో దేశంలోనే ఒక చ‌రిత్ర సృష్టిస్తుంద‌న్నారు. ఎన్నో ర‌కాల సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నామ‌ని తెలిపారు. విదేశాల‌లో ఉండే తెలంగాణ ఎన్నైరైలు గర్వ‌ప‌డేలా టీఆర్ఎస్ పార్టీ ప‌నిచేస్తుంద‌న్నారు . ఎన్నారై పాల‌సీ మీద కూడా టీర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషి చేస్తున్నార‌న్నారు.