‘అస‌లేం జ‌రిగింది’ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన ఎంపీ సంతోష్ కుమార్

157
asalem Ayenedi

ఎక్సోడ‌స్ మీడియా సంస్ధ నిర్మిస్తున్న అస‌లేం జ‌రిగింది సినిమా పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించారు ఎంపీ సంతోష్ కుమార్. సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈకార్య‌క్ర‌మంలో ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ..శ్రీమ‌తి నీలిమా ప్రొడ్యూస‌ర్ గా శ్రీరాం హీరోగా రూపొందుతున్న ఈచిత్రం విజ‌యవంతం కావాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు.

asalem jarigindi poster

తెలంగాణ రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ తీయ‌ని కొత్త ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జ‌ర‌పాల‌నుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఇందుకోసం చిత్ర‌యూనిట్ ఆరు నెల‌ల పాటు తెలంగాణ‌లోని వివిధ ప్రాంతాల‌ను సంద‌ర్శించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఈచిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న కెమెరామెన్ ఎన్ వీ ఆర్ కు శుభాకాంక్షాలు తెలిపారు.