కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం..

426
voter ID
- Advertisement -

పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరితో పాటు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు గల్లంతయిన వారికి ఎన్నికల సంఘం మరో ఛాన్స్‌ ఇచ్చింది. ఓటరు నమోదుకు నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. వచ్చే ఏడాదిలో గ్రామ పంచాయతీ, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌, పార్లమెంట్‌ వంటి ఎన్నికల ఉన్నందున కొత్తగా అర్హులైన ఓటర్లతో పాటు జాబితాలో ఓట్లు గల్లంతైన ఓటర్లను నమోదు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రక్రియ నేటి నుండి జనవరి 25 వరకు కొనసాగనుంది. అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

voter ID

డిసెంబరు 26న ఓటర్‌ జాబితా ముసాయిదా విడుదల చేసి, జనవరి 25 వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించనున్నది. ఫిబ్రవరి 11లోగా జాబితాను పరిశీలించి, 18న కొత్త జాబితా రూపొందించి, 22న ప్రకటించనున్నది. దీంతో టీఆర్‌ఎస్‌ సహా వివిధ రాజకీయ పార్టీలు కూడా కొత్త ఓటర్లను నమోదు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఓటు నమోదు చేసుకోవాలని శ్రేణులతో పాటు యువతీ యువకులకు పిలుపునిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతగా ఓటు నమోదు చేసుకుని ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి http://ceotelangana.nic.in/ వెబ్‌సైట్‌ లేదా 9223166166/51969 నంబర్లకు ‘ TSVOTEVOTERID NO’ నమూనాలో ఎస్సెమ్మెస్‌ పంపడం ద్వారా కూడా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునే అవ‌కాశం ఉంది.

- Advertisement -