” ఆదిపురుష్ ” ఈసారైనా ఆకట్టుకుంటుందా ?

36
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మొట్ట మొదటి మైథాలాజికల్ మూవీ ” ఆది పురుష్ “. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. మోషన్ గ్రాఫిక్స్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ మూవీ కోసం అభిమానులతో పాటు కమాన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. .

అయితే ఈ మూవీ పై ఉన్న అంచనాలన్నిటిని గతంలో రిలీజ్ టీజర్ పటాపంచలు చేసింది. నాసిరకపు గ్రాఫిక్స్ తో కార్టూన్ మూవీని తలపించేలా ఉండడంతో చిత్రయూనిట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే రామాయణాన్ని కించపరిచేలా రాముడి గెటప్ మరియు రావణాసురుడి గెటప్ ఉన్నాయనే విమర్శలు, వివాదాలు కూడా గట్టిగానే వచ్చాయి. దాంతో 2023 సంక్రాంతికి రావాల్సిన మూవీ జూన్ కు వాయిదా పడింది. మొదట ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు కాగా.. మళ్ళీ గ్రాఫిక్స్ కోసం అదనంగా రూ.150 కోట్లు పెరిగింది. ఇక ఈ మూవీని ఎట్టకేలకు జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Also Read: NagaChaitanya: ప్రతి సంఘటన ఒక పాఠం నేర్పుతుంది

కాగా ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 9 న విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ గ్రాఫిక్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో చిత్రయూనిట్ ఈసారి ఎలాంటి జాగ్రత్తలు వహించింది. గ్రాఫిక్స్ ను ఎంతవరకు మెరుగుపరిచింది అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. మరీ వీటన్నిటికి సమాధానం దొరకాలంటే మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే. తీవ్ర విమర్శలు వ్యతిరేకత ఎదురుకొంటున్న ” ఆదిపురుష్ ” మూవీ ప్రభాస్ కు ఎలాంటి సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.

Also Read: ప్రముఖ సింగర్ మన్నా పుట్టిన రోజు

- Advertisement -