ఆ దర్శకుడు నన్ను లైంగికంగా వేధించాడు..!

247
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్, ఫిల్మ్ ఫేర్ అవార్డు విజేత కంగనా రనౌత్ తాజాగా లైంగికంగా వేధింపులపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ‘క్వీన్’ సినిమా సమయంలో దర్శకుడు వికాస్ బెహెల్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. వికాస్ తనను వేధిస్తున్నాడని ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థకు చెందిన యువతి ఆరోపించిన నేపథ్యంలో కంగన ఆమెకు మద్దతుగా ముందుకొచ్చింది. ఫాంటమ్ ఫిల్మ్స్‌ను దర్శకులు అనురాగ్ కశ్యప్, వికాస్, నిర్మాత మధు మంతెన కలిసి స్థాపించారు.

Kangana Ranaut

అయితే గతంలో క్వీన్ టీమ్‌లో పని చేసిన ఓ సభ్యురాలిని లేట్ నైట్ కావడంతో వికాస్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. ఆ సందర్భంగా ఇద్దరు మద్యం మత్తులో ఉన్నామనే అవకాశాన్ని వాడుకుని తనను వేధించే ప్రయత్నం చేసాడనే ఆరోపణలతో సదరు ఆర్టిస్టు తీవ్రంగా ఫైర్ అయ్యింది. ఈ వివాదం గురించి మాట్లాడుతూ కంగనా తాను ఆ అమ్మాయి వైపే ఉంటానని ఎందుకుంట స్త్రీలోలుడైన వికాస్ బహ్ల్ అలా ప్రవర్తించి ఉంటాడనటంలో ఆశ్చర్యం లేదని చెప్పి షాక్ ఇచ్చింది.

అంతే కాదు పెళ్లయ్యాక కూడా రోజుకో అమ్మాయితో గడపాలి అని కోరుకునే అతని మనస్తత్వం గురించి గట్టిగానే చురకలు వేసింది. ఇలాంటి వేధింపుల పర్వం పరిశ్రమలో ముందు నుంచే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం విస్తృత చర్చకు దారి తీస్తోంది. కంగనా మణికర్ణిక ప్రమోషన్స్ కోసం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఎదురైన ప్రశ్నకు సమాధానంగా వికాస్ బహ్ల్ గురించి నిజాలు చెప్పడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -