అదరగొట్టిన ఆక్వామేన్.. వీడియో

256
Aquaman Extended Video
- Advertisement -

హాలీవుడ్‌లో ఇదివరకూ రిలీజైన ఆక్వామేన్ సినిమా సంచలన విజయం సాధించింది. 3డి విన్యాసాలతో ఆ చిత్రం కట్టిపడేసింది. ఇక అవెంజర్స్ 2లో ఆక్వామేన్ విన్యాసాలు కళ్లకు మిరుమిట్లు గొలిపాయి. భీకర భయానక భీభత్సమైన పోరాట సన్నివేశాల్లో ఆక్వామేన్ బలం చూశాం. ఈవిల్ పవర్‌తో పోరాడే సముద్రపు సూపర్ మేన్‌లా విరుచుకుపడే అతడి విన్యాసాలు ఫెంటాస్టిక్ అనాల్సిందే. ప్రస్తుతం ఆక్వామేన్ – ఎక్స్ టెండెడ్ రాబోతుంది.

Aquaman Extended Video

ఇదిగో డిసెంబర్ 21న ఆక్వామేన్ – ఎక్స్ టెండెడ్ గ్లింప్స్ చూడబోతున్నాం. ఇది సీక్వెల్ సినిమా. ఇది హాలీవుడ్‌తో పాటు టాలీవుడ్..బాలీవుడ్..కోలీవుడ్‌ భాషల్లోకి అనువాదమవుతోంది. ఈ నేపథ్యంలో 5నిమిషాల 33 సెకెన్ల నిడివితో భారీ వీడియోని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్‌. ఈ భారీ 3డి విజువల్ మూవీ ఇండియా నుంచి మరో రూ.300- 500 కోట్లు కొల్లగొట్టడం ఖాయమేనని భావించవచ్చు. ఐదున్నర నిమిషాల ఈ విడియో మైండ్ బ్లోయింగ్‌ అనకుండా ఉండలేరు.. వీఎఫ్ ఎక్స్ మిరాకిల్స్‌కి మచ్చు తునక ఈ వీడియో. మరి ఆలస్యం ఎందుకు మీరు ఓ లుక్కేయండి..

- Advertisement -