మహాకూటమిపై మండిపడ్డ మంత్రి హరీశ్ రావు..

270
Minister Harish Rao
- Advertisement -

మందపల్లిలో నిర్వహించిన ఏకగ్రీవ తీర్మాన సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. మంత్రి హరీశ్‌రావు ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి.. తీర్మాన పత్రాలను అన్ని కుల సంఘాలు మంత్రికి అందజేశాయి. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, టీఆర్ఎస్‌పై పోటీ పడేందుకు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, వారికి జెండా, అజెండా ఏమీ లేదని, పాతబట్టలన్నీ కలిపి కుట్టిన బొంతలా మహాకూటమి పరిస్థితి ఉందని విమర్శించారు.

Minister Harish Rao

మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. బతుకమ్మ చీరల పంపిణీపై కాంగ్రెస్‌ది ఓర్వలేనితనం అని అన్నారు. మందపల్లిలో 850 ఎకరాలకు రూ.85లక్షల రైతుబంధు చెక్కులు పంపిణీ చేశాం. రైతుబంధు చెక్కులపై కూడా కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఒక భరోసా వచ్చిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మరలా గెలిస్తే ఏమి చేస్తామో మేనిఫెస్టోలో పొందుపరుస్తాం అని మంత్రి తెలిపారు.

తెలంగాణను నిలబెట్టాలని టీఆర్ఎస్ చూస్తుంటే, పడగొట్టాలని టీడీపీ చూస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో టీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై ఆయన నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లాలోని కోడూరు మండలం మందపల్లి గ్రామస్థులు ఏర్పాటు చేసిన తీర్మానసభకు హాజరైన హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -