బాహుబలి ‘థాలి’… రుచి చూస్తారా

367
Now a Thali in Gujarat for Baahubali
- Advertisement -

‘బాహుబలి-2’ ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే జక్కన్న టీం దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. దీంతో ఇప్పుడు బాహుబలి మానియాతో మార్మోగిపోతోంది. దీనిని క్యాచ్ చేసుకునేందుకు చిన్న చితక కంపెనీల దగ్గరి నుంచి మల్టీనేషనల్ కంపెనీలు క్యూ కడుతున్నాయి.

ఇప్పటికే టీషర్టులు, టోపీలు… యాప్స్, ప్రకటనలు ఇలా చెప్పుకుంటూ పోతే ఏవో ఒకటి బాహుబలి పేరుతో మార్కెట్లో ఇక సందడి చేస్తూనే ఉంటాయి. తాజాగా ఎయిర్ టెల్ బాహుబలి పేరుతో ప్రత్యేక సిమ్‌ని మార్కెట్‌లోకి విడుదల చేయగా తాజాగా ఓ రెస్టారెంట్‌లో మెనులో చేరింది బాహుబలి. బాహుబలి సినిమాలానే బాహుథాలి అనే ప్రత్యేక వంటకాన్ని తీసుకొచ్చాడు గుజరాత్‌లోని ఓ హోటల్ యజమాని.

ఈ హోటల్ లో సాంప్రధాయ గుజరాతి వంటలుకు ఫేమస్. ఇక్కడుకు వచ్చిన టూరిస్ట్ లు పక్కగా ఆ హోటల్ ఫుడ్ టేస్ట్ చేయడానికే వస్తారట. బాహుబలి తాళి లో రిచ్ గుజరాతి ఫుడ్ తో పాటు రాజ్వడు కల్చర్ ని చెప్పే ఫుడ్ కూడా ఉంటుంది. సాధారణంగా అయితే, థాలిలో పలు రకాల వంటకాలను ఎంచుకునే అవకాశం ఉండదు. కానీ, ‘బాహుబలి-థాలి’లో మాత్రం రాజస్థానీ, గుజరాతీ వంటకాలను రుచి చూపిస్తోంది. ఈ సందర్భంగా ఆ రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ, ‘బాహుబలి’ బృందం తమ రెస్టారెంటులో ఆతిథ్యం స్వీకరించాలని కోరుకుంటున్నామని తెలిపింది.

Now a Thali in Gujarat for Baahubali

- Advertisement -