రాష్ట్రంలో మరో 1326 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్..

146
ts govt jobs
- Advertisement -

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భ‌ర్తీ చేసేందుకు ప్రభుత్వం వరుసగా జాబ్‌ నోటిఫికేష‌న్లు విడుదల చేస్తోంది. తాజాగా బుధ‌వారం రాష్ట్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌లో ఖాళీగా ఉన్న 1,326 డాక్ట‌ర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఇందులో అసిస్టెంట్ సివిల్ స‌ర్జ‌న్ పోస్టులు 751, ట్యూట‌ర్ పోస్టులు 357, అసిస్టెంట్ సివిల్ స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్ పోస్టులు 211, అసిస్టెంట్ సివిల్ స‌ర్జ‌న్ ప్రివెంటివ్ మెడిసిన్ పోస్టులు 7 ఉన్నాయి. వీటి కోసం అభ్య‌ర్థులు జూలై 15 నుంచి ఆగ‌స్టు 14 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంది. మరిన్ని వివ‌రాల కోసం https://mhsrb.telangana.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

- Advertisement -