- Advertisement -
ఇవాళ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. శనివారం (సెప్టెంబర్ 24) నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా వచ్చే నెల 1న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. ఒక్క నామినేషన్ కంటే ఎక్కువ వస్తే అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఇక అక్టోబర్ 19న ఫలితాలను విడుదల చేయండగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పోటీ పడనున్నారని సమాచారం. 1998 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనుండటం ఇదే మొదటిసారి.
- Advertisement -