- Advertisement -
అమెరికాలో కరోనా ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా త్వరలో మోడెర్నా టీకా కూడా వినియోగంలోకి రానుంది. ఇక ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా టీకా తీసుకున్నారు.
డెలావర్‌లోని క్రిస్టియానా ఆసుపత్రిలో 78 ఏళ్ల బైడెన్ ఫైజర్ వ్యాక్సీన్ మొదటి డోసు ఇచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడిన బైడెన్ … వ్యాక్సీన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి అమెరికా ప్రజలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. క్రిస్మస్ సందర్బంగా ప్రజలు భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
గత వారం నుంచే అమెరికాలో పెద్దఎత్తున కరోనా టీకాను ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. కరోనాతో ఇప్పటివరకు అమెరికాలో మూడు లక్షల 20 వేల మంది చనిపోయారు.
- Advertisement -