మోడీ సర్కార్ గతంలో రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేసి ఎంతటి ప్రజాగ్రహానికి గురైందో అందరికి తెలిసిందే. 2016 నవంబర్ 8 న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నాట్లు ప్రకటించి దేశ ప్రజల గుండెల్లో ఒక్కసారిగా బాంబ్ పేల్చారు ప్రధాని మోడీ. ఆ సమయంలో ప్రజలు ఎదుర్కొన్నా ఇబ్బందులు వర్ణనాతీతం. పాత నోట్ల స్థానంలో కొత్త్గ రూ.500 మరియు రూ.2000 నోట్లను తీసుకొని వచ్చి కచ్చితంగా పాతనోట్లను మార్చుకోవాలని లేదంటే అవి చెల్లవాని ప్రకటించింది. దీంతో గంటల తరబడి బ్యాంకుల ముందు పడిగాపులు, ఎటిఎంల ముందు బారెడు పొడుగునా క్యూలు అబ్బో ప్రజలు ఎదుర్కొన్నా ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. .
కొందరు నోట్లు మార్చుకోలేని సామాన్యులు వారి దగ్గర ఉన్న పాత నోట్లన్నీ కూడా చిత్తు కాగితాలైన పరిస్థితి దీంతో మోడీ సర్కార్ తీవ్ర స్థాయిలో ప్రజాగ్రహం పెల్లుబుక్కింది. అయితే మళ్ళీ ఇన్నాళ్లకు 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నాట్లు ప్రకటించి మరోసారి ప్రజలను కలవర పాటుకు గురి చేసింది కేంద్రం. అయితే ఈసారి నోట్ల రద్దును ఆర్బీఐ ప్రకటించింది. మరి అప్పుడు ప్రజల ముందు దైర్యంగా నోట్ల రద్దు ప్రకటించిన ప్రధాని ఇప్పుడు ఆర్బీఐ చేత ప్రకటించేలా చేయడం ఏంటనే సందేహం రాక మానదు.
Also Read:సీఎం ఆఫర్.. ఎన్టీఆర్ మాత్రం నో
దీనికి సమాధానంగా కాస్త వెనక్కి వెళితే నోట్ల రద్దు కు ప్రధాన కారణం.. నల్లధనాన్ని బయటకు తీయడమే అని అప్పుడు ప్రధాని మోడీ చెప్పిన మాట. మరి ఈ ఏడేళ్లలో మోడీ సర్కార్ బయటకు తీసిన నల్లధనం ఎంత అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇంకా రూ.2000 నోట్లు అందుబాటులోకి వచ్చిన తరువాత అవినీతి పెరిగిందని బ్లాక్ మని చేయడం ఇంకా సులభం అయిందనే వాదన కూడా వినిపించింది. దీంతో మోడీ సర్కార్ పై తీవ్రమైన విమర్శలు, ప్రతిపక్షాల ఆరోపణలు గట్టిగానే వినిపించాయి. దీంతో ఈసారి రూ.2000 వేల నోట్ల రద్దు విషయంలో కూడా ప్రజల ముందు ప్రకటన చేస్తే తీవ్రమైన ప్రజాగ్రహం ఎదుర్కొక తప్పదని గ్రహించి. భయంతో ఆర్బీఐ చేత ఈసారి నోట్ల రద్దు ప్రకటన చేయించరనేది కొందరి రాజకీయ వాదుల అభిప్రాయం.
Also Read:కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!