కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

44
- Advertisement -

తరచూ వంటింట్లో ఉపయోగించే వాటిలో కరివేపాకు తప్పనిసరిగా ఉంటుంది. కూరలకు గుమగుమలాడే సువాసనతో పాటు చక్కని రుచిని ఇవ్వడంలో కరివేపాకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అయినప్పటికి దీనిని కంచంలో నుంచి పక్కకు తీసేసి తింటూ ఉంటారు. అయితే కరివేపాకు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. దీనిని తినకుండా అసలు ఉండలేరు. కరివేపాకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, బి2, వంటివి కూడా అధికంగానే ఉంటాయి. అందువల్ల మన శరీరానికి కరివేపాకు చాలా రకాలుగా ఉపయోగ పడుతుంది. .

అందుకే ఆయుర్వేద మెడిసన్స్ లో కూడా కరివేపాకు ను ఔషధంలా ఉపయోగిస్తుంటారు. డయబెటిస్, హైపర్ టెన్షన్ వంటి తదితర వ్యాధిగ్రస్తులకు కరివేపాకు నివారిణిగా పని చేస్తుంది. పడగడుపున ప్రతిరోజూ 5 నుంచి 10 కరివేపాకు ఆకులు తింటే డయబెటిస్ నియంత్రణలోకి వస్తుందట. కేవలం ఆకులు మాత్రమే కాకుండా కరివేపాకు చెట్టు బెరడు, పండ్లలో కూడా ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. వీటిని కషాయంలా తయారు చేసుకొని సేవించడం వల్ల హైపర్ టెన్షన్ దురమౌతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:లవ్‌ డ్రామాల కలయికే మళ్లీపెళ్లి :ఎంఎస్ రాజు

అలాగే వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో భాద పడే వారు లేత కరివేపాకు ఆకులను రసంగా చేసుకొని దానికి కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి ఉదర సమస్యలు తగ్గుతాయి. కరివేపాకు పొడి తేనె కలిపి తీసుకుంటే అమీబియాసిస్ వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలను నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా పొడి దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇక కరివేపాకును ప్రతిరోజూ మనం తినే ఆహార పదార్థాలతో పాటు జత చేసుకోవడం వల్ల క్యాన్సర్ కరకాల నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే పైల్స్ సమస్యతో భాడపడే వారికి కూడా కరివేపాకు ఒక చక్కని ఔషధంలా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:సీఎం ఆఫర్.. ఎన్టీఆర్ మాత్రం నో

- Advertisement -