Revanth:ఎవరికి భయపడం

16
- Advertisement -

ఎన్నికల్లో గెలుపు కోసం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను ఉపయోగించుకుంటోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈడీ, ఐటీ తర్వాత ఢిల్లీ పోలీసులను ఉపయోగించుకుని గాంధీభవన్‌పై దాడులు చేశారన్నారు.ఇప్పుడు సీబీఐ అయిపోయిందని, రాజకీయ ప్రత్యర్థులపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని అన్నారు.

కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా బీజేపీని ఓడిస్తామని రేవంత్ అన్నారు.రిజర్వేషన్లపై హోంమంత్రి చేసిన వ్యాఖ్యను వక్రీకరించిన కేసు.. స్పీచ్ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎడిట్ చేశారనడం కరెక్ట్ కాదన్నారు. ఢిల్లీ పోలీసుల గురించి తాను పట్టించుకోనని, తగిన సమాధానం చెబుతానని తెలిపారు.

ఈ బోగస్ వీడియోతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని ..సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటోందని, ఇప్పుడు ఢిల్లీ పోలీసులను రేవంత్ దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ ఇలాంటి చిప్ ట్రిక్స్ వేస్తోందన్నారు.

Also Read:కరీంనగర్‌కు రేవంత్..

- Advertisement -