కుమార్తెను పరిచయం చేసిన నియంత…

352
- Advertisement -

అధునిక నియంత ఉత్తరకొరియా సుప్రీం లీడర్‌ కిమ్‌జోంగ్‌ఉన్‌ అగ్రరాజ్యం అమెరికాతోనే ఢీ అంటే ఢీ అంటూ యావత్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశాడు. ఈ మధ్య కిమ్‌ వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. చిన్న అంశాన్ని సైతం ఎంతో గోప్యంగా ఉంచే కిమ్.. ఇప్పుడు ఏకంగా తన ఫ్యామిలి మెంబర్స్‌ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

దాదాపు ఏడు నెలల క్రితం భార్యతో కలిసి కనిపించిన కిమ్.. తాజాగా తొలిసారి తన కుమార్తెతో కలిసి బహిరంగంగా కనిపించారు. ఇలా ఆయన కుమార్తెతో కనిపించడం ప్రపంచవాప్తంగా చర్చనీయాంశమైంది.

కుమార్తెతో కలిసి చేతిలో చేయి వేసి నడుస్తున్న కిమ్ ఫొటోలను అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్రచురించింది. నవంబరు 18న ఓ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు వస్తూ కిమ్ తన కుమార్తెను కూడా వెంటబెట్టుకొచ్చారు.

ఇవి కూడా చదవండి…

అధర్మపురి..ఓడిపోవడానికి రెడీనా!

ట్రెండింగ్‌లో #GoogdByeTwitter!

ఆటగాళ్లకు ఎస్కార్ట్‌గా ఎఫ్‌-16…

- Advertisement -