క్లాస్ కమిడియన్ గా పేరు తెచ్చుకుని, ఆ తర్వాత దర్శకుడుగా మారి, ఇప్పుడు హీరోగా రాణిస్తు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. బట్టతల సమస్య ప్రధానాంశంగా సినిమా తెరకెక్కగా సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. మరి ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంతో అవసరాల శ్రీనివాస్ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం…
కథ:
గొత్తి సత్యనారాయణ అలియాస్ జిఎస్‌ఎన్ (అవసరాల శ్రీనివాస్) ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. వంశ పారంపర్యంగా వచ్చిన బట్టతలతో సతమతమవుతూ ఉంటాడు. బట్టతల అని తెలియకుండా విగ్గుతో మేనేజ్ చేస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ అంజలి(రుహాని శర్మ)తో పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది…?బట్టతల గురించి తెలిసిన జీఎస్‌ఎన్ ఏం చేస్తాడు..?చివరకు కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఫస్టాఫ్, అవసరాల శ్రీనివాస్ నటన,కామెడీ. గొత్తి సత్యనారాయణ పాత్రలో ఒదిగిపోయారు అవసరాల శ్రీనివాస్. అభద్రతాభావంతో సతమతమయ్యే యువకుడిగా చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్ రుహానీ శర్మ నటన సూపర్బ్. చక్కని అభినయంతో మెప్పించింది. మిగితా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథనం, భావోద్వేగాలు. సెకండాఫ్‌లో కథ, కథనంపై మరింత దృష్టిసారిస్తే బాగుండేది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం ఆకట్టుకుంటుంది. రామ్ కెమెరా పనితనం, కిరణ్ గంటి ఎడిటింగ్ బాగుంది. అవసరాల శ్రీనివాస్ నటుడిగానే కాకుండా.. రచయితగా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
తాము అందంగా లేనని భావించే కొద్దిమంది వ్యక్తుల్లో అభద్రతాభావం, ఆత్మన్యూనత భావం ఎలా ఉంటుందనే సబ్జెక్ట్‌తో తెరకెక్కిన చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. కామెడీ, అవసరరాల శ్రీనివాస్ నటన సినిమాకు ప్లస్ పాయింట్ కాగా సెకండాఫ్‌పై మరింత దృష్టిసారిస్తే బాగుండేది. ఓవరాల్‌గా పర్వాలేదనిపించే మూవీ నూటొక్క జిల్లాల అందగాడు.
విడుదల తేదీ:03/09/2021
రేటింగ్:2.75/5
నటీనటులు: అవసరాల శ్రీనివాస్, రుహాని శర్మ
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
నిర్మాత: శిరీష్ రాజీవ్ రెడ్డి
దర్శకుడు: రాచకొండ విద్యాసాగర్