పేదల ఆత్మగౌరవానికి ప్రతీక..డబుల్ బెడ్‌రూం ఇల్లు

163
pocharam
- Advertisement -

బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో నూతనంగా నిర్మించిన 25 డబుల్ బెడ్ రూం ఇళ్ళను మరియు నూతనంగా నిర్మించిన డ్వాక్రా మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించారు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలో స్పీకర్ మాట్లాడుతూ…స్వంత ఇంటి కల నెరవేరిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్ బెడ్ రూం ఇల్లు అన్నారు.

స్వంత స్థలం ఉన్నవారికి స్వంతంగా కట్టుకోవడానికి ఇల్లును మంజూరు చేశాం అన్నారు. డబుల్ బెడ్ రూం ఇంటిలో రెండు బెడ్ రూం లలో ఒకటి కన్న తల్లిదండ్రులకు, మరొకటి పిల్లలకు అన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడటానికి ఇంట్లోనే బాత్రూం లను కట్టుకోవాలని చెబుతున్నాం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే పదివేల ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు.

నియోజకవర్గ పరిధిలో స్వంత ఇల్లు లేని పేదలందరికి విడతలవారిగా స్వంత ఇంటిని మంజూరు చేయిస్తానని తెలిపారు. వెనకటి లాగా సగం బాకీ సగం మాఫీ లేదు, పేదవారిపై బారం పడకుండా డబుల్ బెడ్ రూం ఇళ్ళను 100 శాతం సబ్సిడీతో మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మాఫీని అమలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా కేసీఆర్ చేసినన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదన్నారు.

మిషన్ భగీరధ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి ఇళ్ళకు త్రాగునీరు అందిస్తున్నారు….సింగూరు ప్రాజెక్టు ద్వారా స్వచ్చమైన మంచినీరు తెచ్చి నియోజకవర్గ పరిధిలోని ఇంటింటికి మంచినీరు అందిస్తున్నాం అన్నారు. పోచారం గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండే విదంగా రూ. 40 లక్షలతో కళ్యాణ మండపం నిర్మిస్తున్నాం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -