సాగర్‌లో భగత్ గెలుపు ఖాయం: గుత్తా

40
gutha

నాగార్జునసాగర్‌ ప్రజలు విజ్ఞతతో ఉన్నారని…నోముల భగత్‌ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా…తెలంగాణ విషయంలో జానారెడ్డి కి ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదన్నారు.

కాంగ్రెస్ సోకాల్డ్ లీడర్లు ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడలేదు…కాంగ్రెస్ నాయకుల దురాశ తో కేసీఆర్ పార్టీ ని విలీనం చేస్తామన్నా వ్యతిరేకించారు ….అధికారం రాలేదన్న బాధ తప్ప తెలంగాణ అభివృద్ధి మీద కాంగ్రెస్ కు సోయి లేదు…బాధ లేదన్నారు.

జానా రెడ్డి కి సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయడం ఇష్టం లేదు,పార్టీ అధిష్టానం బలవంతంగా నిలబెట్టిందని జానారెడ్డి చెప్పిండు…జానా రెడ్డి కి ఇద్దరు కొడుకులతో తల నొప్పి ఉందన్నారు. జానారెడ్డి పేరును వారు ఖరబ్ చేస్తున్నారని…..నాగార్జున సాగర్ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు.