వ్యాక్సిన్ తీసుకోకుంటే…రేషన్,పెన్షన్ బంద్..

85
dmho
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఎనమిది నెలల కనిష్టానికి తగ్గి 12 వేలకు పడిపోగా మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇక రాష్ట్రంలో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండగా ఇకపై రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోని వారికి రేషన్, పెన్షన్ బంద్ చేయనున్నట్లు డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.

నవంబర్ 1 నుండి దీనిని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపిన ఆయన…డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో వందశాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని హైకోర్టు నిర్దేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -