రంగమార్తాండకు చిరు సాయం..

39
chiru

చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ. మరాఠి క్లాసిక్‌ నట సామ్రాట్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి రంగ మార్తండ అనే టైటిల్‌ని ఖరారు చేయగా ఈ మూవీలో ప్రకాజ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రంగస్థల కళాకారుడి తెర వెనక జీవితం నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

కృష్ణవంశీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి యాడ్ అయ్యారు. అన్నయ్య చిరంజీవి తన ‘రంగమార్తండ’ మూవీకి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు కృష్ణవంశీ మంగళవారం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. దానికి సంబంధించిన ఓ ఫోటోనూ పోస్ట్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది.