కొత్త ట్రెండ్‌…నో ట్రౌజర్స్‌ డే

83
- Advertisement -

ప్రపంచంలో పత్తి పంటను సాగు చేస్తున్నప్పటి నుండి మానవులు శరీరంపై బట్టలు వేసుకుంటున్నారు. ఇది వేల యేళ్ల క్రితం నుంచి వస్తుంది. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుత యువత ఆలోచిస్తున్నారు. స్త్రీ పురుష బేధాలు లేకుండా అందరూ సమానమైన ఈ రోజుల్లో ఒక వింత ఈవెంట్‌ ట్రెండ్ సెట్ట్‌ చేస్తున్నారు. గతంలో న్యూయార్క్‌లో నోప్యాంట్స్‌ అనే ఈవెంట్‌ను సబ్‌వేరైడ్‌లో ఏడుగురు కుర్రాళ్లతో కలిసి ప్రారంభించారు. చినికి చినికి గాలివానగా మారినట్టుగా…ఇప్పుడు ఇదొక అంతర్జాతీయ ఈవెంట్‌గా విస్తరించింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 60కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. తాజాగా లండన్ నగరంలోని ఎలిజబెత్ లైన్‌లో ప్రారంభమైంది. అయితే ఇది ఇరవై యేళ్ల క్రితం న్యూయార్క్‌లో ప్రారంభించామని ది స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ పేర్కొంది. ఇది కేవలం నవ్వించేందుకు మాత్రమే ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిని సరదాగా తీసుకోవాలి. ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు కాదని వారు కోరారు. బస్సు, మెట్రో, రోడ్లపై ఇలా ఎక్కడ చూసిన అధికశాతం మంది ప్యాంటు లేకుండానే మీకు తారసపడతారు. ఆడవారుసైతం కేవలం డ్రాయర్ మీదనే రోడ్లపై ఏంచక్కాతిరిగేస్తారు.

ఇలాంటి వింత ఈవెంట్ యూఎస్‌ఏలోని న్యూయార్క్ నగరంలో కనిపిస్తుంది. అయితే ప్రతీరోజూ కాదు. కేవలం గ్లోబల్ ఈవెంట్ రోజుమాత్రమే. దీనిని నో ట్రౌజర్స్ డే అంటారు. అంతేకాదు నో ప్యాంటు డే అనికూడా పిలుస్తారు. లండన్‌లోని ప్రధాన వీధుల్లో నో ట్రౌజర్స్ డే పరేడ్‌లో పాల్గొంటారు. వీరంతా ప్యాంటు లేకుండా కేవలం నిక్కర్ లేదా డ్రాయర్ మీదమాత్రమే కనిపిస్తారు. అయితే ఇందులో మహిళలు సైతం అధికంగా ఉండటం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి…

ఉత్తర భారతదేశాన్ని వణికిస్తోన్న చలి..

మస్క్‌ చెత్త రికార్డు.. 16 లక్షల కోట్లు లాస్

వెరికోవైన్స్ ను తగ్గించే ‘ వజ్రాసనం ‘ !

- Advertisement -